NTV Telugu Site icon

Bus-Tanker Accident: బస్సు- ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది సజీవ దహనం

Accident

Accident

Bus-Tanker Accident: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురగా ఢీకొన్న ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మూడు రోజుల్లో ప్రావిన్స్‌లో జరిగిన రెండవ అతిపెద్ద రోడ్డు ప్రమాదం ఇది అని రెస్క్యూ అధికారులు తెలిపారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్తాన్‌లోని హైవేపై అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత కొన్ని గంటలపాటు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

“లాహోర్ నుండి కరాచీకి వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది మరణించారు. ఢీకొన్న తర్వాత, బస్సు మరియు ట్యాంకర్ రెండూ మంటల్లో చిక్కుకోగా ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. ” అని పాకిస్థాన్​ రెస్క్యూ 1122 విభాగం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాలిన గాయాలకు గురైన వారిని ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది.మరణించిన చాలా మంది ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్ష తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఏం జరిగిందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని… సమాచారం అందిన వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు .అయితే.. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా మారిందన్నారు.

PM Narendra Modi: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్

ప్రమాదంలో విలువైన ప్రాణాలు కోల్పోవడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత ఆరోగ్య అధికారులను ఆదేశించారు. అలాగే మరణించిన వారి కుటుంబాలను గుర్తించేందుకు సహకరించాలని ఆదేశించారు. శనివారం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో లోడుతో కూడిన ట్రక్కు ప్రయాణీకుల బస్సును ఢీకొనడంతో కనీసం 13 మంది మరణించారు.

Show comments