Site icon NTV Telugu

రోడ్డుపై 186 కిలోల గోల్డెన్ క్యూబ్‌…షాకైన ప్ర‌జ‌లు…

రోడ్డుపై వీస‌మెత్తు బంగారం క‌నిపిస్తేనే వ‌ద‌ల‌రు. అలాంటిది ఏకంగా 186 కిలోల బంగారం క‌నిపిస్తే చూస్తూ ఊరుకుంటారా చెప్పంది. అయితే, అంత‌పెద్ద మొత్తంలో ఒకే చోట ఉండ‌టంతో చూసిన ప్ర‌జ‌లు షాక్ అయ్యారు. సూర్య‌కాంతిలో మెరిసిపోతున్న దానిని చూసి, ముట్టుకుంటూ ఫొటోలు దిగారు. 186 కిలోల 24 క్యారెట్ల బంగారంతో జ‌ర్మ‌నీకి చెందిన నిక్లాస్ కాస్టెలో అనే ఆర్టిస్ట్ గోల్డెన్ క్యూబ్‌ను త‌యారు చేశాడు. ఈ గోల్డెన్ క్యూబ్ ను న్యూయార్క్‌లోని సెంట్ర‌ల్ పార్క్‌లో ఉంచారు. అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌జ‌లు ఆ గొల్డెన్ క్యూబ్ ను చూసి షాక‌య్యారు. దానిద‌గ్గ‌ర ఫొటోలు దిగారు.

Read: ఒమిక్రాన్ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టానికి కార‌ణం ఇదే…

అయితే, ఇదంటా నిక్లాస్ ఎందుకు చేశారు అంటే ప‌బ్లిసిటీ స్టంట్ కోస‌మే చేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే నిక్లాస్ కాస్టెలో కాయిన్ పేరుతో క్రిప్టోకాయిన్ లాంచ్ చేయ‌బోతున్నారు. దీనికోస‌మే ఆయ‌న ఈ విధంగా చేశార‌ట‌. న్యూయార్క్ సెంట్ర‌ల్ పార్క్ నుంచి గొల్డెన్ క్యూబ్ ను ప్రైవేట్ డిన్న‌ర్‌కు త‌ర‌లించారు. ఆ ప్రైవేట్ డిన్న‌ర్‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా పాల్గొని గోల్డెన్ క్యూబ్ ఫొటోలు దిగార‌ట‌. ఇక ఈ గోల్డెన్ క్యూబ్‌ను త‌యారు చేయ‌డానికి సుమారు రూ. 88 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అయిన‌ట్టు నిక్లాస్ కాస్టెలో పేర్కొన్నారు.

Exit mobile version