Site icon NTV Telugu

South Africa: బార్‌లో కాల్పులు.. 14 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

Bar Shooting In South Africa

Bar Shooting In South Africa

దక్షిణాఫ్రికా జొహెన్నస్‌బర్గ్‌లోని సెవేటో టౌన్‌షిప్‌లో కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఓ బార్‌లో కాల్పులు జరగ్గా 14 మంది మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. జొహెన్నస్‌బర్గ్‌లో గల సెవేటో టౌన్‌షిప్‌లోని ఓ బార్‌కు కొందరు దుండగులు మినీ బస్‌లో వచ్చి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. శక్తిమంతమైన తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడిన కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్

తాము ఘటనా స్థలానికి చేరుకున్నప్పుజు 12 మంది మృతులను గుర్తించామని పోలీసు లెఫ్టినెంట్ ఎలియాస్ మావెలా తెలిపారు. మరో 11 మందిని గాయాలతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారని తెలిపారు. వారి మృతితో మృతుల సంఖ్య 14కి పెరిగిందని మావెలా చెప్పారు. ఇది జోహన్నెస్‌బర్గ్‌లోని అతిపెద్ద టౌన్‌షిప్. రాజధానికి ఆగ్నేయంగా ఉంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version