NTV Telugu Site icon

Russian-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి.. 136 డ్రోన్లు ప్రయోగం

Russia

Russia

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌లోని కైవ్ మరియు ఇతర నగరాలపై రష్యా 136 డ్రోన్లు ప్రయోగించింది. ఇందులో 51 డ్రోన్లను ఉక్రెయిన్ వాయు రక్షణ దళం కూల్చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. డ్రోన్ దాడుల కారణంగా రాజధాని వెలుపల ప్రాంతంలోని ఒక ప్రైవేటు నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. అంతేకాకుండా పలు భవనాలు కూడా దెబ్బతిన్నాయి.

ఇది కూడా చదవండి: Darshan: రేణుకాస్వామికి కొడుకు పుట్టిన రోజే దర్శన్ వెన్ను నొప్పికి ఉపశమనం!

దాడిలో ఉపయోగించిన 136 డ్రోన్లలో 68 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినట్లు వైమానిక దళం తెలిపింది. రెండు డ్రోన్లు రష్యాకు తిరిగి వచ్చాయి. 64 డ్రోన్ల ఆచూకీ మాత్రం తెలియలేదు. రెండు డ్రోన్లు మాత్రం లక్ష్యాలు చేరుకున్నట్లు గుర్తించారు. మంటలు అంటుకున్న ప్రాంతాలను 50 మంది అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్‌లోని ఉత్తర చెర్నిహివ్, తూర్పు డొనెట్స్క్ ప్రాంతాలపై కూడా రష్యా రెండు క్షిపణులను ప్రయోగించిందని, అయితే వాటికి ఏమి జరిగిందో చెప్పలేదని వైమానిక దళం తెలిపింది.

ఇది కూడా చదవండి: Railway: రైలులో ప్రయాణించే రోగులకు రైల్వే ప్రత్యేక రాయితీ.. ఏ రోగులకు ఎంత రాయితీ తెలుసా..?