Site icon NTV Telugu

Afghan-Pak Conflict: 24 గంటల్లో 8 దాడులు.. 12 మంది పాక్ సైనికులు హతం..

Pakistan

Pakistan

Afghan-Pak Conflict: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్రమయ్యాయి. గత వారం మొదలైన ఈ ఘర్షణ వల్ల ఇరు వైపులు పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘాన్ ధాటికి తట్టుకోలేక, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలను మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ వేడుకుంది. దీంతో రెండు దేశాలు 48 గంటల ‘‘కాల్పుల విరమణ’’కు ఒప్పుకున్నాయి.

Read Also: Afghan-Pak War: ఆఫ్ఘాన్-పాక్ యుద్ధం.. ట్రెండింగ్‌లో ‘‘93,000’’.. భారత్‌తో సంబంధం..

ఇదిలా ఉంటే, తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) మాత్రం పాక్ ఆర్మీ, పోలీసులపై విరుచుకపడుతోంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌ పై పాక్ తాలిబాన్లు 8 కోఆర్డినేటెడ్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 13 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. వజీరిస్తాన్‌లోని మీర్ అలీలోని పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. 24 గంటల్లోనే టీటీపీ ఈ దాడులు చేసింది.

పాకిస్తాన్ తాలిబాన్ మద్దతు ఉన్న ఆత్మాహుతి కారు బాంబర్ శుక్రవారం పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో, ఆఫ్ఘాన్‌ సరిహద్దుల్లో పాక్ ఆర్మీపై దాడి జరిగింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని మీర్ అలీ నగరంలో రెండు ఆత్మాహుతి బాంబు దాడులు జరిగినట్లు సమాచారం. నివేదికల ప్రకారం ఇప్పటికీ కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version