Site icon NTV Telugu

Mann Ki Baat: ప్రధాని మోడీ “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్.. ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్స్‌లో లైవ్

Pm Modi

Pm Modi

100th Episode Of PM Modi’s ‘Mann Ki Baat’: ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం మరో ఘనతను సాధించింది. ఏప్రిల్ 30న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ‘‘ ప్రధాన మంత్రి ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న యూఎన్ హెడ్ క్వార్టర్స్ లోని ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నందున ఒక చారిత్రాత్మక క్షణానికి సిద్ధంగా ఉండండి’’ అంటూ ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ ట్వీట్ చేసింది.

Read Also: Maoist letter : వరంగల్ లో మావోయిస్టుల లేఖ కలకలం

ప్రతీ నెల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ పేరుతో రేడియో ప్రసంగం ద్వారా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఏప్రిల్ 30న దీనికి సంబంధించిన 100 వ ఎపిసోడ్ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. అమెరికా కాలమాన ప్రకారం అక్కడ ఉదయం 1.30 గంటలకు న్యూయార్క్ లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మిలియన్ల మంది పాల్గొనేందుకు మన్ కీ బాత్ స్పూర్తినిస్తుందని భారత మిషన్ పేర్కొంది.

న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, కమ్యూనిటీ సంస్థలతో పాటు, న్యూజెర్సీలోని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యుల కోసం ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ ప్రసారం జరుగుతోంది. 2014 అక్టోబర్ 3న ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ నెట్వర్క్ ద్వారా తొలిసారిగా ప్రసారం చేయబడింది. 30 నిమిషాల నిడివిగల ఈ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం కానుంది.

Exit mobile version