Tutankhamun: ఈజిప్టు ఫారో రాజులకు సంబంధించిన పాలన ఇప్పటికీ చాలా మిస్టరీగా ఉంది. పిరమిడ్ల నిర్మాణం, మమ్మీలుగా మార్చే విధానంపై గత కొన్ని దశాబ్ధాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అందరూ రాజుల్లోకెల్లా ‘‘టూటన్‌ఖామున్’’ రాజు పాలన, అతడి మరణం చాలా ప్రత్యేకం. ఇంతే కాకుండా అతని సమాధిలో దొరికిన సంపద ఆ సమయంలో సంచలనంగా మారింది. అయితే, సమాధిని కనుగొనడంలో సాయం చేసిన కొందరు మాత్రం అనుమానాస్పద రీతిలో మరణించడంతో ఒక్కసారిగా ‘‘టూటన్‌ఖామున్ శాపం’’ అనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. 1922 నుంచి ఈ భయం కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు దీనికి ఓ సైంటిఫిక్ కారణాలను వెలుగులోకి తీసుకువచ్చారు. రాస్ ఫెలోస్ రాసిన ‘‘జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్‌ప్లోరేషన్’’లోని కథనం ఇప్పుడు ఆ భయాలనున తొలగించేలా చేస్తోంది. యురేనియం వంటి విషపూరిత పదార్థాలు ఆ మరణాలకు కారణం కావచ్చనే కొత్త ప్రతిపాదన చేశారు. 3000 ఏళ్లుగా మూసి ఉన్న సమాధిలో ఈ విషపదార్థాలు మరింత శక్తివంతంగా తయారై సమాధిలోకి వెళ్లిన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించినట్లుగా ఫెలోస్ అభిప్రాయపడ్డారు.
Read Also: Congress: అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామాతో కాంగ్రెస్‌లో ప్రకంపనలు..
ఆయన చేసిన అధ్యయనం టూటన్‌ఖామున్ సమాధిలో రేడియేషణ్ స్థాయిలను గుర్తించి సూచిస్తోంది. ఈ రేడియేషన్‌కి గురికావడం వల్లే క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని పరిశోధన సూచిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ.. పురాతన, ప్రస్తుతం ఈజిప్టు సమాజంలోని జనాభాలో గమనించిన బ్లడ్, బోన్, లింప్ నోడ్స్ క్యాన్సర్లతో పాటు ఈ రేడియేషన్ లెవల్స్‌కి మధ్య సంబంధాలను కూడా పరిశోధన ప్రస్తావించింది. ఈ నిర్దిష్ట క్యాన్సర్లు రేడియేషన్ ఎక్స్‌పోజర్‌తో సంబంధం కలిగి ఉంది. ఈ రేడియోధార్మికత ఒక్క టూటన్‌ఖామున్ సమాధికి మాత్రమే పరిమితం కాలేదని పరిశోధన హైలెట్ చేసింది. పిరమిడ్‌కి ఆనుకుని ఉన్న గిజా వద్ద ఉన్న రెండు ప్రదేశాలలో కూడా రేడియేషన్ కనుగొనబడింది, సరక్కాలోని అనేక భూగర్భ సమాధుల్లో కూడా కనుగొనబడిందని పరిశోధన వెల్లడించింది.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని సిద్ధాంతాలు సమాధుల్లో ఉన్న ప్రమాదాల గురించి ఆ కాలం నాటి వారిలో కొందరికి స్వయంగా తెలిసి ఉండొచ్చని సూచిస్తున్నాయి. సమాధుల్లోని గోడలపై ఈ ప్రమాదాల గురించి హెచ్చరికలు ఉన్నాయి. ‘‘ఈ సమాధిని విచ్ఛిన్నం చేసిన వారు ఏ వైద్యుడు కూడా నిర్ధారించలేని వ్యాధిలో మరణాన్ని ఎదుర్కొంటారు’’ అని కొన్ని సమాధులపై స్పష్టంగా రాయబడిన విషయాన్ని ఫెలోస్ ప్రస్తావించారు.
టూటన్‌ఖామున్ సమాధిలోకి ప్రవేశించిన వారిలో ఆ సమాధిని వెతికేందుకు ఆర్థిక సహకారం అందించిన లార్డ్ కార్నర్‌వాన్‌తో పాటు పలువురు కొన్ని రోజులకే వివిధ కారణాలు, అనారోగ్యాలతో మరణించారు. అప్పటి నుంచి టూటన్‌ఖామున్ శాపం తగిలిందని, ఆత్మలు వెంటాడి చంపేస్తున్నాయంటూ కథనాలు వచ్చాయి. బ్లడ్ పాయిజనింగ్, న్యూమోనియా కారణంగా కొన్ని వారాల తర్వాత కార్నర్‌వాన్ మరణించినట్లు ఫెలోస్ పరిశోధనలో రాశారు.