NTV Telugu Site icon

Work 4Days a Week : ఉద్యోగుల పంటపండింది.. ఇక వారానికి 4రోజులే పని

4day

4day

Work 4Days a Week : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి వారానికి నాలుగురోజలు పని చేస్తే చాలు. అవును మీరు చదువుతున్నది నిజమే.. కానీ మన దగ్గర కాదు.. ఉద్యోగులపై ఒత్తిడిని తగ్గించేందుకు బ్రిటన్ లోని కంపెనీలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సుమారు వంద కంపెనీలు ఉద్యోగులకు పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంచలన ప్రకటన చేశాయి. ఇకపై ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వారంలో నాలుగురోజులు పని చేస్తే చాలు.. మరి జీతంలో కోత వేస్తారేమోనన్న సందేహం వద్దు. నెలంతా వేతనం చెల్లిస్తారు. ఈ వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది ప‌నిచేస్తున్నారు. 4 డే వీక్ క్యాంపెయిన్‌లో భాగంగా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లండ‌న్‌లోని అతి పెద్ద కంపెనీలు అయిన అట‌మ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 450 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి.

Read Also: FIFA World Cup: ఓ వైపు సంబరాలు.. మరోవైపు అల్లర్లు.. ఖతర్ మొత్తం ఖాకీల చేతుల్లోకి

వారంలో నాలుగే పనిదినాలు కల్పించడంతో ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారని.. కంపెనీల ఉత్పాదకతకు అది దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. ఉద్యోగులు ఒత్తిడి లేకుండా పని చేయడం వల్ల మంచి అవుట్‌పుట్‌ను సృష్టించవచ్చన్నారు. యూర‌ప్‌లోని మిగ‌తాదేశాల‌తో పోల్చితే బ్రిట‌న్‌లోనే ప‌నిదినాలు ఎక్కువ‌. దాంతో, నాలుగు రోజుల ప‌నిదినాలను ముందుగానే ప్రయోగాత్మకంగా బ్రిట‌న్‌లోని కొన్ని కంపెనీల్లో ప్రవేశపెట్టారు. ఆ కంపెనీల్లో ఉద్యోగుల ప‌నితీరు బాగుండ‌డంతో మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. అంతేకాదు కొత్తవాళ్లు ఆ కంపెనీలో చేర‌డానికి ఆస‌క్తి చూపించారు. ఉన్న ఉద్యోగులు కంపెనీ వీడ‌కుండా చేయ‌డంలో నాలుగు రోజుల ప‌నిదినాల ఫార్ములా బాగా ప‌నిచేసింది. అందుక‌ని త‌మ ఉద్యోగుల‌కు కూడా ఆ సౌక‌ర్యం క‌ల్పించేందుకు బ్రిట‌న్‌లోని వంద కంపెనీలు ఆమోదం తెలిపాయి.

Show comments