Site icon NTV Telugu

Sensex crosses 60,000 mark: గత నాలుగు నెలల్లో తొలిసారిగా 60,000 మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

Sensex Crosses 60,000 Mark

Sensex Crosses 60,000 Mark

Sensex crosses 60,000 mark: మన దేశ స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. 30 రోజులుగా ర్యాలీ కొనసాగుతోంది. గత నాలుగు నెలల్లో తొలిసారిగా ఇవాళ సెన్సెక్స్‌ 60 వేల మార్క్‌ దాటింది. ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత సెన్సెక్స్‌ 60 వేల మార్క్‌ దాటడం ఇదే మొదటిసారి. గ్లోబల్‌ మార్కెట్లలో పాజిటివ్‌ సిగ్నల్స్‌ నెలకొన్నాయి. ఇండియా లాంటి ఎమర్జింగ్‌ మార్కెట్ల వైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ చూపు సారిస్తున్నారు. సెన్సెక్స్‌ మరోసారి 60 వేల మార్క్‌ దాటడం స్థానిక రిటైల్‌ ఇన్వెస్టర్ల సామర్థ్యానికి సంకేతమని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

టాప్‌-100లోకి ట్రెంట్‌

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఎం-క్యాప్‌) పరంగా అత్యంత విలువైన 100 కంపెనీల ఎలైట్‌ క్లబ్‌లోకి ఇవాళ ట్రెంట్‌ ఎంటరైంది. ఈ సంస్థ షేర్‌ ధర రూ.1,477కి పెరిగింది. ట్రెంట్‌ ఎం-క్యాప్‌ తాజాగా రూ.51,912 కోట్లకు చేరింది. ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటోను దాటే పైకెదిగి ఈ ఘనతను సొంతం చేసుకుంది. టాటా గ్రూప్‌ సంస్థ అయిన ఈ ట్రెంట్‌ ఆధ్వర్యంలోనే వెస్ట్‌సైడ్‌ అనే ఫ్యాషన్‌ రిటైల్‌ స్టోర్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. వెస్ట్‌సైడ్‌.. ఇండియాలోని లీడింగ్‌ స్టోర్లలో ఒకటి కావటం గమనార్హం.

TRS Party: వరుస ఎన్నికల నేపథ్యంలో.. సోషల్ మీడియా వింగ్‌ని బలోపేతం చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ

ఎయిర్‌టెల్‌ అడ్వాన్స్‌ పేమెంట్‌

5జీ స్పెక్ట్రం కోసం ఎయిర్‌టెల్‌ కంపెనీ నాలుగేళ్ల ఇన్‌స్టాల్‌మెంట్‌ని ముందుగానే చెల్లించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికం(డీఓటీ)కి 8,312.4 కోట్ల రూపాయల పేమెంట్‌ చేసినట్లు ఇవాళ వెల్లడించింది. ఇటీవలే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొన్న ఈ సంస్థ రూ.43,039.63 కోట్ల విలువైన స్పెక్ట్రం కోసం విజయవంతంగా బిడ్‌ను దాఖలు చేసింది.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

నిన్నటి మాదిరిగానే ఇవాళ కూడా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 317 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 60,159 వద్ద ట్రేడింగ్‌ అవుతుండటం విశేషం. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 17923పైనే కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది. ప్రస్తుతం 79.44 వద్ద ఉంది. జయంత్‌ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ షేరు నెల రోజుల్లోనే 219 శాతం పెరిగింది. ప్రారంభ ధర రూ.87.90తో మొదలై ఇవాళ రూ.280.55కి ఎదిగింది.

Exit mobile version