NTV Telugu Site icon

నిర్మలమ్మ బడ్జెట్ పై కోటి ఆశలు

కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌పై తమకు ఊరట కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు ఇన్ కంట్యాక్స్ పరిమితి పెంచుతారని ఆశిస్తున్నారు. 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

సెక్షన్‌ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని వేతన జీవులు, ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ కోరికను నిర్మలమ్మ మన్నిస్తారా? స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ.1లక్షకు పెంచాలంటున్నారు. నిర్మలమ్మ బడ్జెట్లో మౌలిక రంగంతోపాటు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించే వీలుందని నిపుణులు అంటున్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌ వివరాలను రాష్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. వార్షిక బడ్జెట్‌ ఎలా వుంటుందనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.