GST: సెప్టెంబర్ 2025లో GST స్థూల వసూళ్లు ₹1.89 లక్షల కోట్లకు పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని మరోసారి ప్రదర్శించింది. గతేడాది సెప్టెంబర్ లో ₹1.73 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాదికి 9.1% పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. GST వసూళ్లు ₹1.80 లక్షల కోట్లను దాటడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. సెప్టెంబర్ వసూళ్లలో ఈ బలమైన పెరుగుదల ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 22, 2025న అమల్లోకి వచ్చిన GST సంస్కరణల తర్వాత జీఎస్టీ వసూళ్లలో పెరుగదల నమోదైంది.
RREAD MORE: Raviteja: అక్టోబర్ 31న మాస్ జాతర
ఆగస్టులో స్థూల GST వసూళ్లు రూ.1.86 లక్షల కోట్లుగా ఉంది. ఆగస్టు 2024లో రూ.1.75 లక్షల కోట్లు ఉండగా.. 6.5% వృద్ధిని సాధించింది. ఆగస్టులో నికర వసూళ్లు 10.7% పెరిగి రూ.1.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే.. జూలైలో ఆ నెలలో అధిక వాపసుల కారణంగా నికర ఆదాయాలు రూ.1.68 లక్షల కోట్లకు తగ్గాయి. ఏప్రిల్-ఆగస్టు కాలంలో GST ఆదాయం మొత్తం రూ.10.04 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.9.13 లక్షల కోట్లుగా ఉండింది.
RREAD MORE: Pok Protests: పాక్ ఆర్మీ అరాచకం.. పీఓకే నిరసనకారులపై కాల్పులు, 8 మంది మృతి..
GST వసూళ్లలో పెరుగుదల ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయని సూచిస్తుంది. ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి. అయితే.. GST సంస్కరణల ప్రభావం క్రమంగా కనబడుతోంది. ఈ సంస్కరణ వల్ల రాబోయే నెలల్లో GST వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. GST సంస్కరణలు దేశీయ డిమాండ్‌ను పెంచుతాయని, దీంతో GDP వృద్ధికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.5% నుంచి 6.8%కి పెంచింది.
