NTV Telugu Site icon

బంగారం కొనేవారికి షాక్..మళ్ళీ పెరిగిన ధరలు

సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రధాని స్పష్టం చేయడంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 48,710 కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి 44,650కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 700 తగ్గి రూ.75,300కి చేరింది.