NTV Telugu Site icon

Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. రెండో రోజు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

Gold Price

Gold Price

మగువలకు బ్యాడ్ న్యూస్.. నేడు మార్కెట్ లో బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు ప్రస్తుత మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. బంగారంపై సుమారు రూ. 300 పెరిగింది.. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం…

• ఢిల్లీలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 గా ఉంది.

• ఇక ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 55,150 , 24 క్యారెట్స్‌ ధర రూ. 60,1603 వద్ద కొనసాగుతోంది.

• కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ రూ. 55,150 , 24 క్యారెట్ల ధర రూ. 60,160 గా ఉందని చెబుతున్నారు..

• అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,450 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది.

• బెంగళూరులో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,150 గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,160 గా ఉంది..
• హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 55,150 , 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,160 గా నమోదు అయ్యింది..

వెండి ధరలను ఒకసారి చూస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,600 , చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,700 , బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 గా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.80,700 గా ఉందని నిపుణులు తెలిపారు.. ఈరోజు మార్కెట్ లో ధరలు కొంతమేర బాగున్నా కూడా రేపటి మార్కెట్ లో ధరలు పెరగవచ్చునని నిపుణులు చెబుతున్నారు..