NTV Telugu Site icon

Gold and Silver Rate Today: పసిడి ప్రేమికులకు శుభవార్త..

Gold And Silver

Gold And Silver

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. మరోసారి పసిడి ధరలు తగ్గాయి.. ఈ ఉదయం దేశంలోని పెద్ద నగరాల్లో బంగారం, వెండి ట్రేడింగ్ ప్రారంభమైంది. దేశంలోని చాలా నగరాల్లో బంగారం మరియు వెండి ధర భిన్నంగా ఉంది.. 22 క్యారెట్ల బంగారం మరియు 24 క్యారెట్ల బంగారం ధర.. నిన్నటి పోలిస్తే ఇవాళ తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు భారత మార్కెట్‌లో ఆరంభంలో పతనం అయ్యింది.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47000 వద్ద కొనసాగుతోంది… ఇది నిన్నటితో పోలిస్తే రూ.410 తక్కువ.. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48000 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో బంగారం ధర వేర్వేరు ధరల్లో ట్రేడవుతోంది. ఈరోజు చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45550గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49690గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47240 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48240గా ఉంది. అదే ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47600గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51900 పలుకుతోంది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47400గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50100గా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45700గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49850గా ఉంది.. ఇక, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45700గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49850గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45700గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49850గా.. పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46800 మరియు 24 క్యారెట్ల బంగారం ధర రూ.49800గా.. వడోదరలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47280గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48820కి తగ్గాయి. ఇదే సమయంలో భారత మార్కెట్‌లో వెండి ధరలో మార్పులు కనిపించాయి.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. భారత మార్కెట్‌లో కిలో వెండి ధర 62300 వద్ద కొనసాగుతోంది.