Site icon NTV Telugu

మ‌హిళ‌ల‌కు షాకిచ్చిన పుత్త‌డి… భారీగా పెరిగిన ధ‌ర‌లు…

క‌రోనా త‌రువాత ఆర్ధిక రంగం క్ర‌మంగా పుంజుకుంటోంది.  సాధార‌ణ ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే నెల‌కొంటున్నాయి.  క‌రోనా కార‌ణంగా మూత‌ప‌డిన అనేక రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి.  గ‌తంలో పుత్త‌డిపై పెట్టుబ‌డులు పెట్టిన ముదుప‌రులు, బంగారంలో పాటుగా ఇత‌ర రంగాల‌పై కూడా దృష్టి సారిస్తున్నారు.  బంగారంపై పెట్టుబ‌డులు పెరుగుతుండ‌టంతో వాటి ధ‌ర‌లు పెరుగుతున్నాయి.  అటు అంత‌ర్జాతీయంగా కూడా పుత్త‌డిపై ముదుప‌రులు అధిక మొత్తంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు.  దీంతో దేశీయంగా వాటి ధ‌ర‌లు పెరుగుతున్నాయి.  ఆరోజు హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 పెరిగి 44,310కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.120 పెరిగి రూ.48,340కి చేరింది.  ఇక బంగారంతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి.  కిలో వెండి ధ‌ర రూ.1000 పెరిగి రూ. 74,900కి చేరింది.  

Read: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 5 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే?

Exit mobile version