Site icon NTV Telugu

Today Horoscope : ఈరోజు ఆ రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి..

Rasiphalalu

Rasiphalalu

అక్టోబర్ 1 ఆదివారం రాశిఫలాలు.. ఏ రాశివారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మేషం..

బంధు, మిత్రులతో కలుస్తారు. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.. ఆర్థిక పరంగా శుభవార్తలు వింటారు.. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి..

వృషభం..

ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం.. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. దైవ దర్శనాలు చెయ్యాలి..

మిథునం..

కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.. శుభవార్తలు వింటారు..

కర్కాటకం..

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతనకార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.. వృధా ఖర్చులు అధికం..

సింహం..

వృధా వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.. ఖర్చులు అధికం..

కన్య…

ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి.

తుల..

ఏ పనిలోనైనా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.. విందులో పాల్గొంటారు..

వృశ్చికం..

ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.

ధనుస్సు..

శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.. ఈరోజు అంతా మంచే జరుగుతుంది..

మకరం..

ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.. జాగ్రత్తగా ఉండాలి..

కుంభం..

మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.

మీనం..

వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి..

Exit mobile version