Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Astrology Predictions : జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహంగా భావించే శుక్రుడు (Venus) రేపు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సంపద, వైభవం, సౌఖ్యాలకు కారకుడైన శుక్రుడు ఏప్రిల్ 6న భరణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 15 వరకు శుక్రుడు ఇదే నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత 16వ తేదీన కృత్తిక నక్షత్రంలోకి అడుగుపెడతాడు. అయితే, శుక్రుడు తన స్వక్షేత్ర నక్షత్రమైన భరణిలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, ఈ మార్పు కొన్ని రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులను కలిగించవచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశులు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
READ ALSO: Price Secret: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగ.. భారత్లో మాత్రం ధరలు ఎందుకు తక్కువ..? అసలు రహస్యం ఇదే..
Also Read
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
- Sunday Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే.!
- Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
1. వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీ నెలవారీ బడ్జెట్ తలకిందులు కావచ్చని అంటున్నారు. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం మంచిదని సూచించారు. తొందరపాటు నిర్ణయాలతో ఆర్థిక నష్టాలు రావచ్చన్నారు.
2. కన్యా రాశి
కన్యా రాశి వారిపై ఈ మార్పు ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని చెప్పారు. ముఖ్యంగా వృత్తిపరమైన రంగంలో సవాళ్లు ఎదురవుతాయన్నారు. ఆఫీస్లో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సౌకర్యాలు తగ్గడం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని చెప్పారు.
3. వృశ్చిక రాశి
భరణి నక్షత్రంలో శుక్రుడి సంచారం వృశ్చిక రాశి వారికి అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ టైంలో మీ రహస్య శత్రువులు చురుగ్గా మారి, మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త పడటం ఉత్తమం అని సూచించారు.
4. మీన రాశి
మీన రాశి వారికి కూడా ఈ సమయం అనుకూలంగా లేదని చెప్పారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తవచ్చని వెల్లడించారు. చేతికి అందాల్సిన డబ్బు నిలిచిపోయే అవకాశం ఉందని, ఎవరికీ అప్పులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయవద్దని జ్యోతిష్యులు సూచించారు. గ్రహ సంచారాల ప్రభావం వ్యక్తిగత జాతక చక్రంపై కూడా ఆధారపడి ఉంటుందని, కాబట్టి పైన పేర్కొన్న రాశుల వారు ఈ పది రోజుల పాటు కాస్త అప్రమత్తంగా ఉంటే సమస్యల నుంచి బయటపడవచ్చని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!