Meerut Viral Video: విడాకుల తర్వాత కూతురికి గ్రాండ్ వెల్‌కమ్.. బాజభజంత్రీలతో తండ్రి ఘనస్వాగతం! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ శాస్త్రీ నగర్ ప్రాంతానికి చెందిన ఒక తండ్రి తన కూతురికి పలికిన ఘనస్వాగతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడిచి, మూడు మూళ్లతో పెళ్లి అనే బంధంలోకి అడుగు పెట్టిన దంపతుల జీవితం విడాకులతో ముగిస్తే ఆ కుటుంబంలో విషాదం ఛాయలు అలముకుంటాయి. కానీ, ఇక్కడ ఒక రిటైర్డ్ జడ్జి తన కూతురు విడాకులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే.. బ్యాండ్ బాజాలతో, పూలమాలలతో స్వాగతం పలికారు.
READ ALSO: Fire Accident: పల్లెవెలుగు బస్సులో మంటలు.. బస్సులో 21 మంది ప్రయాణికులు…
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ఆరేళ్ల పోరాటం.. చివరకు
శాస్త్రీ నగర్ ప్రాంతానికి చెందిన ఒక రిటైర్డ్ జడ్జి తన కూతురు ప్రతీక్షకు అపూర్వ స్వాగతం పలికారు. 2018లో ప్రతీక్షకు మేజర్ గౌరవ్ అగ్నిహోత్రితో వైభవంగా వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే, పెళ్లయిన కొంతకాలానికే దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అత్తవారింట్లో వేధింపులు, మనోవేదన భరించలేక ప్రతీక్ష కోర్టును ఆశ్రయించింది. దాదాపు ఆరేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, ఏప్రిల్ 4, 2026న కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. కోర్టు నుంచి విడాకుల పత్రంతో ఇంటికి చేరుకున్న కూతురిని చూసి ఆ తండ్రి కుంగిపోలేదు. పైగా, ఆమె పడుతున్న నరకం నుంచి విముక్తి లభించిందని సంతోషించారు.
ప్రతీక్ష కారు దిగగానే రోడ్డుపై బాజభజంత్రీలు మోగించారు. కుటుంబ సభ్యులందరూ ఆమెపై పూల వర్షం కురిపించారు. ముఖ్యంగా ప్రతీక్ష తండ్రి “I Love My Bitiya” అని రాసి ఉన్న వైట్ టీషర్టు ధరించి, తన కూతురిని ఆత్మీయంగా ముద్దాడి లోపలికి ఆహ్వానించారు. బంధువులందరూ మిఠాయిలు పంచుకుంటూ, డ్యాన్సులు చేస్తూ ఆ క్షణాన్ని వేడుకలా మార్చేశారు. “కూతుళ్లు ఎప్పటికీ భారం కాదు. కొడుకులతో సమానంగా వారికి గౌరవం దక్కాలి. పెళ్లిలో సంతోషం లేనప్పుడు, నరకం అనుభవిస్తూ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నా బిడ్డ గౌరవంగా బతకాలని నేను కోరుకుంటున్నాను” ప్రతీక్ష తండ్రి అన్నారు. విడాకులు తీసుకుంటే సమాజం ఏమని అనుకుంటుందో అని భయపడే తల్లిదండ్రులకు ఈ ఘటన ఒక కనువిప్పు. ఆరేళ్ల పాటు మానసిక వేదన అనుభవించిన తన కూతురు, ఇప్పుడు స్వేచ్ఛగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆ తండ్రి ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. “ప్రతి తండ్రి ఇలాగే ఆలోచిస్తే, ఏ ఆడపిల్ల కూడా అత్తవారింట్లో వేధింపులకు బలికాదు” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
డైవర్స్ తీసుకున్న కూతురికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తండ్రి. బాజభజంత్రీలతో ఘనస్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, బంధువులు pic.twitter.com/XREMS10Hcx
— Vidyarthi (@ShivaganeshAga1) April 5, 2026
READ ALSO: Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?