Site icon NTV Telugu

Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!

Today Astrology

Today Astrology

Astrology Predictions : జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహంగా భావించే శుక్రుడు (Venus) రేపు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సంపద, వైభవం, సౌఖ్యాలకు కారకుడైన శుక్రుడు ఏప్రిల్ 6న భరణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 15 వరకు శుక్రుడు ఇదే నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత 16వ తేదీన కృత్తిక నక్షత్రంలోకి అడుగుపెడతాడు. అయితే, శుక్రుడు తన స్వక్షేత్ర నక్షత్రమైన భరణిలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, ఈ మార్పు కొన్ని రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులను కలిగించవచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశులు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

READ ALSO: Price Secret: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగ.. భారత్‌లో మాత్రం ధరలు ఎందుకు తక్కువ..? అసలు రహస్యం ఇదే..

1. వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీ నెలవారీ బడ్జెట్ తలకిందులు కావచ్చని అంటున్నారు. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం మంచిదని సూచించారు. తొందరపాటు నిర్ణయాలతో ఆర్థిక నష్టాలు రావచ్చన్నారు.

2. కన్యా రాశి
కన్యా రాశి వారిపై ఈ మార్పు ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని చెప్పారు. ముఖ్యంగా వృత్తిపరమైన రంగంలో సవాళ్లు ఎదురవుతాయన్నారు. ఆఫీస్‌లో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సౌకర్యాలు తగ్గడం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని చెప్పారు.

3. వృశ్చిక రాశి
భరణి నక్షత్రంలో శుక్రుడి సంచారం వృశ్చిక రాశి వారికి అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ టైంలో మీ రహస్య శత్రువులు చురుగ్గా మారి, మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త పడటం ఉత్తమం అని సూచించారు.

4. మీన రాశి
మీన రాశి వారికి కూడా ఈ సమయం అనుకూలంగా లేదని చెప్పారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తవచ్చని వెల్లడించారు. చేతికి అందాల్సిన డబ్బు నిలిచిపోయే అవకాశం ఉందని, ఎవరికీ అప్పులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయవద్దని జ్యోతిష్యులు సూచించారు. గ్రహ సంచారాల ప్రభావం వ్యక్తిగత జాతక చక్రంపై కూడా ఆధారపడి ఉంటుందని, కాబట్టి పైన పేర్కొన్న రాశుల వారు ఈ పది రోజుల పాటు కాస్త అప్రమత్తంగా ఉంటే సమస్యల నుంచి బయటపడవచ్చని అన్నారు.

READ ALSO: Meerut Viral Video: విడాకుల తర్వాత కూతురికి గ్రాండ్ వెల్‌కమ్.. బాజభజంత్రీలతో తండ్రి ఘనస్వాగతం! వీడియో వైరల్

Exit mobile version