Site icon NTV Telugu

Lunar Eclipse: కొద్దిసేపట్లో చంద్రగ్రహణం.. ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇవే..

Moon

Moon

Lunar Eclipse: ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7. ఈ చంద్రగ్రహణం శని రాశి కుంభరాశిలో జరుగుతుంది. దీనితో చంద్రుడు పూర్వాభాద్రపద, శతభిష నక్షత్రంలో ఉంటాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్‌ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి.. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్‌ వైడ్‌గా 85శాతం మంది చూసే అవకాశం ఉంటుంది. ఇది చాలా అరుదైన చంద్రగ్రహణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది మరో 19 సంవత్సరాల వరకు ఇలాంటి చంద్రగ్రహణం పునరావృతం కాదు దీనిని పెనంబ్రల్ చంద్రగ్రహణం అని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే.. ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇప్పుడు చూద్దాం..

READ MORE: Canara Bank Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ లేకుండానే జాబ్

చంద్రగ్రహణం ప్రారంభం – 09:58 PM
చంద్రగ్రహణం ముగింపు – ఉదయం 01:26, సెప్టెంబర్ 08
గ్రహణం వ్యవధి – 03 గంటల 28 నిమిషాల 02 సెకన్లు
పెనుంబ్రల్ గ్రహణం ప్రారంభం – రాత్రి 08:59
పెనుంబ్రా నుంచి మొదటి స్పర్శ – రాత్రి 09:58
సంపూర్ణ గ్రహణం ప్రారంభం – రాత్రి 11:01 గంటలకు
సంపూర్ణ చంద్రగ్రహణం – రాత్రి 11:42
సంపూర్ణ గ్రహణం ముగింపు- సెప్టెంబర్ 08, ఉదయం 12:22 గంటలకు
సబ్‌షాడో నుంచి చివరి టచ్ – సెప్టెంబర్, ఉదయం 02:24 గంటలకు
సంపూర్ణ గ్రహణం వ్యవధి – 01 గంట 21 నిమిషాల 27 సెకన్లు
చంద్ర గ్రహణం తీవ్రత – 1.36
పెనుంబ్రల్ చంద్ర గ్రహణం తీవ్రత – 2.34

READ MORE: Pizza: “పిజ్జా”కు యుద్ధానికి సంబంధం ఏమిటి.. అమెరికాలో ఏం జరుగుతోంది..?

Exit mobile version