Site icon NTV Telugu

Surya Grahan 2025: ఆదివారం అమావాస్య.. నేడే సూర్యగ్రహణం.. ఈ నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్త!

Surya

Surya

Surya Grahanam: హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా సూర్య గ్రహణం, చంద్రగ్రహణం వేర్వేరు నెలల్లో వస్తుంటాయి. కానీ, ఈసారి మాత్రం ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడంతో వాటి ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్యు అంటున్నారు. అయితే, హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ క్రమంలో, ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం నేడు (సెప్టెంబర్ 21న) రాబోతుంది. కాగా, ఈ గ్రహణం ఎఫెక్ట్ భారత్‌లో ఉండదని సమాచారం. అందువల్ల మన దేశంలో సూతక కాలం వర్తించదు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడంతో సూర్యకాంతి కొంతమేర తగ్గుతుంది.

Read Also: Current wires: ఎవర్రా మీరంతా.. కరెంట్ వైర్లతో ఊయ్యలా ఉగడమేంట్రా..

అయితే, ఈ సూర్యగ్రహణం నేడు (సెప్టెంబర్ 21న) రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:23 గంటల వరకు ఉంటుంది. ఇది ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం. ఇక, 2027 ఆగస్టు 2వ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతి పెద్దది అని చెప్పాలి. ఆ తర్వాత 2114వ ఏడాదిలో ఇలాంటి గ్రహణం సంభవించే ఛాన్స్ ఉంది. కాగా, ఇవాళ ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు కళ్లకు హానికరం.. కాబట్టి ఈ గ్రహణాన్ని నేరుగా చూడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. టెలిస్కోప్‌లు, బైనాక్యులర్లు లేదా ఆఫ్టికల్ పరికరాల సాయంతో చూడాలంటున్నారు.

Read Also: Deepika : ప్రభాస్‌తో రెండు సినిమాలు వదిలేసి.. దీపికా ఎన్ని కోట్లు నష్టం బోయిందో తెలుసా?

కాగా, వందేళ్లకు ఒకసారి ఇలాంటి సూర్య గ్రహణం సంభవిస్తుందని జోతిష్య పండితులు అంటున్నారు. ఆదివారం, అమావాస్య రోజే గ్రహణం సంభవించడంతో కొన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉందని సిద్ధాంతులు పేర్కొంటున్నారు. కాగా, భారత్ లో ఈ గ్రహణం కనిపించే అవకాశం లేదని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. అయితే, ఈ సూర్యగ్రహణం ప్రభావం ముఖ్యంగా నాలుగు రాశులపై దాని ప్రభావం చూపిస్తుంది. మిథునం, కన్యారాశి, ధనుస్సు రాశి, మీనా రాశుల వారిపై దీని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది.

Exit mobile version