Site icon NTV Telugu

Chandra Grahan: రేపే చంద్రగహణం.. ఈ రాశుల వాళ్లు జర జాగ్రత్త..

Chandra Grahan

Chandra Grahan

Chandra Grahan: సెప్టెంబరు 7న భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం రాత్రి 9గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాల వరకు ఉంటుందని పలువురు జ్యోతిష్యనిపుణులు తెలిపారు. సూత కాలం, ఏయే రాశివారు గ్రహణం చూడకూడదనే అంశాలతో పాటు ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: CM Revanth Reddy : ఆకస్మికంగా ట్యాంక్‌బండ్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

5 గంటల లోపు ఆలయాలు మూసివేయాలి..
ఈసందర్భంగా పలువురు జ్యోతిష్యనిపుణులు మాట్లాడుతూ.. గ్రహణ వ్యవధి కాలం మూడు గంటల 30 నిమిషాలు ఉంటుందన్నారు. రాత్రి 11.42 నిమిషాలకు గ్రహణ మధ్యస్థ కాలమని పేర్కొన్నారు. ఈ చంద్ర గ్రహణం ఆసియా ఖండంలో అనేక దేశాల్లో కనబడబోతోందని, భారతదేశంపైనా దీని ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఈ గ్రహణం వల్ల దేశంలోని ఆలయాలన్నీ ఏడో తేదీ సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలని చెప్పారు. తర్వాతి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరించాలని పేర్కొన్నారు. భారత్‌, రష్యా, సింగపూర్‌, చైనాలో కొన్ని ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుందని తెలిపారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం ఆరు గంటల లోపే భోజనాది నియమాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆరు గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం కొనసాగేవరకూ ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిదని చెప్పారు.

ఈ గ్రహణంలో కుంభ, మీనం, మిథునం, సింహ రాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని సూచించారు. గ్రహణం సమయంలో రాహు జపం చేయడం, దుర్గా దేవిని పూజించడం, పట్టు విడుపు స్నానాలు ఆచరించడం, వెండి వంటివి దానం చేయడం వంటివి శుభఫలితాలు ఇస్తాయని చెప్పారు. కొన్ని రాశుల వారికి (కుంభం, మీనం, మేషం, మిథునం, సింహం) ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

శాస్త్రం ఏం చెబుతుంది..
గ్రహణ సమయంలో నిద్ర పోవద్దన్నదని శాస్త్రం చెప్తున్నట్లు పేర్కొన్నారు. చంద్ర గ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు ఆచరించడం ఉత్తమమని సూచించారు. గ్రహణం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉంచడం మంచిదన్నారు. గ్రహణ కాల వ్యవధిలో ఇంటి లోపలే ఉండేలా చూసుకోండని సూచించారు.

READ ALSO: Shocking Crime: స్నేహితుడితో చూడకూడని స్థితిలో భార్య.. మరణశాసనం రాసిన భర్త..

Exit mobile version