Astrology: ఫిబ్రవరి 28, సోమవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం :- వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థకు గురవుతారు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృషభం :- ప్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. సోదరులతో అవగాహన లోపిస్తుంది. పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చుచేస్తారు.
Also Read
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
మిథునం :- కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలిసిస్తుంది. ఇంటర్వ్యూలలోజయం మిమ్మల్ని వరిస్తుంది. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది.
కర్కాటకం :- ప్రభుత్వ కార్యాలయాల్లో వసులు మందకొడిగా సాగుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. మిత్రుల కలయికతో మనసు కుదుటపడుతుంది. స్త్రీల ప్రతిభకు తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి.
సింహం :- ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. గత కొంతకాలంగా ఆగిన పనులు పునఃప్రారంభించారు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది.
కన్య :- కిరణా, ఫాన్సీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన సత్ఫలితాలు పొందగలరు. గత అనుభావాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.
తుల :- ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి జాయింట్ వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బంది కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరుతాయి. బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది.
ధనస్సు :- సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో చికాకులు తప్పవు.
మకరం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా వ్యక్తం చేయండి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.
కుంభం :- వృత్తిపరంగా ఎదురైన సమస్యలు క్రమేణా తొలగిపోగలవు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు.
మీనం :- ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పవు. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి.
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!