Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..

  • జూన్ 11 నుంచి మహాలక్ష్మి రాజయోగం ప్రారంభం
  • నాలుగు రాశుల వారికి ధనలాభ యోగాలు
  • నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు
  • ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు
Mahalakshmi Rajyoga

Mahalakshmi Rajyoga

Mahalakshmi Rajyoga: 2026 జూన్ 11 నుంచి జూన్ 13 వరకు అత్యంత శుభప్రదమైన ‘‘మహాలక్ష్మీ రాజయోగం’’ ఏర్పడనుంది. కుజుడు, చంద్రుడి కలయికతో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల కొన్ని రాశులు ప్రయోజనం పొందుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగం వల్ల సంపద, శ్రేయస్సు, విజయాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, సంపదకు కారకుడు. కుజుడు భూమి, ధైర్యం, శక్తి, కార్యసాధనకు కారకుడు. ఈ రెండు గ్రహాలు కలియక వల్ల ఈ విషయాల్లో మంచి విషయాలు జరుగుతాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారు అదృష్టాన్ని పొందొచ్చు.

మేష రాశి:

×
×
Ad

ఈ మహాలక్ష్మి రాజయోగం మేష రాశి వారికి అత్యంత ఫలవంతంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల, ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నిలిచిన నిధులు పొందే ఛాన్స్ ఉంది. డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే దానిని తిరిగి పొందొచ్చు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కర్కాటకం:

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, అందువల్ల కుజుడితో కలయిక ఆర్థిక విషయాల్లో శుభవార్త అందిస్తుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో చేసే పెట్టుబడులు భారీ లాభాలు తెచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి:

మహాలక్ష్మి రాజయోగం సింహరాశి వారికి అపారమైన అదృష్టాన్ని తెస్తోంది.మీ ప్రణాళికలు అన్నీ కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పనిచేసే చోట మీ కీర్తి పెరుగుతుంది. పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కెరీర్‌లో కొత్త అవకాశాల వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి.

వృశ్చికం:

కుజుడికి వృశ్చికం స్వరాశి. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు చాలా కాలంగా అప్పుల సమస్యల్లో ఉంటే దాని నునంచి బయటపడే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.