Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khappar Yog 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 మే నెల అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఒకవైపు బుధాదిత్య, రుచక, మాలవ్య వంటి శుభప్రదమైన రాజయోగాలు కనిపిస్తుండగా.. మరోవైపు అత్యంత అశుభకరమైన ‘ఖప్పర్ యోగం’ (పుర్రె యోగం) కూడా ఏర్పడుతోంది. శుభ, అశుభ యోగాలు ఏకకాలంలో సంభవించడం వల్ల సామాన్యుల జీవితాల్లో ఆకస్మిక మార్పులు, తీవ్ర ఒత్తిడి, అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ ఖప్పర్ (పుర్రె) యోగం..
కుజుడు, శని, సూర్యుడు, రాహువు వంటి గ్రహాలు అశుభ స్థానాల్లో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య గణాంకాల ప్రకారం.. ఒక నెలలో ఐదు శనివారాలు లేదా ఐదు మంగళవారాలు రావడం, అమావాస్య-సంక్రాంతి ఒకే రోజు సంభవించడం ఈ యోగ తీవ్రతను పెంచుతాయి. ముఖ్యంగా జూన్ 15, 2026న సోమవతి అమావాస్యతో పాటు మిథున సంక్రాంతి కలవనుండటం వల్ల ఈ ప్రభావం మరింత బలోపేతం కానుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చిరస్తున్నారు. దృక్ పంచాంగం ప్రకారం ఈ దోష ప్రభావం జూన్ 29 వరకు కొనసాగే అవకాశం ఉంది.
Also Read
- Vastu Tips: మనీ ప్లాంట్‌ను ఈ దిశలో పెడితే ధన యోగం వస్తుందా?.. వాస్తు నిపుణులు చెప్పే సూచనలు ఇవే
- Astrology: జూన్ 30 సోమవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
ప్రభావం చూపే రాశులు ఇవే..
మిథునం: ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు పెరగవచ్చు. చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆగిపోయే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిన్నపాటి అజాగ్రత్త కూడా భారీ నష్టాలకు దారితీయవచ్చు.
కన్య: ఆరోగ్య విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శత్రువుల నుంచి ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మీ రహస్యాలను, భవిష్యత్తు ప్రణాళికలను ఇతరులతో పంచుకోకపోవడం ఉత్తమం.
మకరం: వృత్తి గతంలో వివాదాలు తలెత్తవచ్చు. అపార్థాల వల్ల గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సహనం పాటించాలి.
మీనం: నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత నెలకొంటుంది. అనవసర ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. భావోద్వేగాలకు లోనై సంబంధాలను దెబ్బతీసుకోవద్దు.
పరిష్కారం ఏమిటి?
ఈ క్లిష్ట సమయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి అడుగు ఆచి తూచి వేయడం, దైవ ప్రార్థన, సానుకూల దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ఈ యోగ దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చని వివరిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, గ్రహ గతుల ఆధారంగా అందించబడింది. దీనిని కేవలం అవగాహన కోసం మాత్రమే గమనించగలరు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!