Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది. కారణం ఈ నెలలో కుంభ రాశిలో త్రిగ్రహి యోగం ఏర్పడుతోంది. ఒకే రాశిలో మూడు ముఖ్య గ్రహాలు కలిస్తే దాన్ని త్రిగ్రహి యోగం అంటారు. ఫిబ్రవరిలో కుంభ రాశిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు కలిసి ఉండబోతున్నారు. ఈ మూడు గ్రహాల శక్తి ఒకేసారి పనిచేయడం వల్ల కొన్ని రాశుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. బుధుడు బుద్ధి, ఆలోచన, మాట, వ్యాపారానికి సంకేతం. సూర్యుడు ఆత్మవిశ్వాసం, నాయకత్వం, అధికారానికి ప్రతీక. శుక్రుడు సుఖాలు, డబ్బు, కళ, ప్రేమకు సంబంధించిన గ్రహం. ఈ మూడు గ్రహాలు ఒకేచోట ఉండటం వల్ల పని, ఆర్థిక స్థితి, పేరు ప్రతిష్ఠ వంటి అంశాల్లో కదలిక పెరుగుతుంది.
READ MORE: Bhatti Vikramarka: తెలంగాణ కు ఆత్మ సింగరేణి.. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు
ఈ యోగం దశలవారీగా మరింత బలపడుతుంది. ఫిబ్రవరి 3న బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో ఫిబ్రవరి 4 నుంచి 12 వరకు కుంభ రాశిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు కలిసి త్రిగ్రహి యోగం పనిచేస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభంలోకి రావడంతో అక్కడ ఇప్పటికే ఉన్న రాహుతో కలిసి ఈ యోగం మరింత బలంగా మారుతుంది. అప్పుడు ఇది చతుర్గ్రహి యోగం అవుతుంది. ఇక ఫిబ్రవరి 23న మంగళుడు కూడా కుంభ రాశిలో చేరగానే, ఐదు గ్రహాలు ఒకేసారి కుంభంలో ఉంటాయి. అప్పుడు ఇది పంచగ్రహి మహాయోగంగా మారుతుంది. ఈ పరిస్థితి మార్చి 14 వరకు కొనసాగుతుంది. ఇది చాలా అరుదుగా కనిపించే శక్తివంతమైన సంయోగం.
ఈ గ్రహాల కలయిక ప్రభావం అందరికీ ఒకేలా ఉండదు. బుధుడు, రాహు కలిసి ఉండటం వల్ల టెక్నాలజీ, ప్లానింగ్, కొత్త ఆలోచనలు, తెలివైన నిర్ణయాల్లో లాభం ఉంటుంది. సూర్యుడు, మంగళుడు కలిసి ఉండటం వల్ల ప్రభుత్వ రంగం, అధికార పదవులు, రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. శుక్రుడు ప్రభావంతో ప్రేమ, కళలు, సౌఖ్యం, డబ్బు విషయంలో ముందడుగు పడుతుంది. అయితే రాహు ప్రభావం వల్ల కొందరికి మానసిక అయోమయం, అనవసర ఆలోచనలు, ఊగిసలాట కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ బలమైన యోగం ముఖ్యంగా కుంభ, మేష, మిథున, సింహ, తుల, ధనుస్సు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితాల్లో ఎదుగుదల, కొత్త అవకాశాలు, మంచి ఫలితాలు కనిపిస్తాయి.
READ MORE: Vidya Balan- Kiara: విద్యాబాలన్, కియారా అద్వానీ పై నెటిజన్ల ఫైర్..
మేష రాశి వారికి ఈ కాలం ఆర్థికంగా చాలా మంచిగా ఉంటుంది. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది. సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంది. పనిలో నిలకడ వస్తుంది. భవిష్యత్తుకు వేసుకున్న ప్రణాళికలు ఫలించే సూచనలు ఉన్నాయి. మరోవైపు.. కుంభ రాశి వారికి ఇది నిజంగా కీలకమైన సమయం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ కదులుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు దక్కుతాయి. బుధుడు, సూర్యుడు కలిసి ఉండటం వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది, నిర్ణయాలు ధైర్యంగా తీసుకోగలుగుతారు. శుక్రుడి ప్రభావంతో డబ్బు విషయంలో ఊరట, సమాజంలో పేరు కూడా పెరుగుతుంది.
READ MORE: Tamil Nadu: ఎన్నికల వేళ కీలక ఘట్టం.. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ బిల్లుకు ఆమోదం
సింహ రాశి వారికి ఈ యోగం గౌరవం, పదవి, నాయకత్వాన్ని తీసుకువస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలన, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. అలాగే పేరు ప్రతిష్ఠ పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య ఈ గ్రహ సంయోగం చాలా మందికి జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే శక్తి కలిగి ఉంది. అవకాశాలు కనిపించినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్లడం, అయోమయానికి లోనుకాకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. గ్రహాలు దారి చూపిస్తాయి.. కానీ అడుగు వేయాల్సింది మనమే.
