Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..

Astrology

Astrology

Dussehra astrology: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా అరుదైన కలయికతో వచ్చింది. జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన పరిణామం సంభవించింది. తులారాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ‘‘త్రిగ్రాహి యోగాన్ని’’ ఏర్పరుస్తున్నాయి. ఈ గ్రహాల కలయిక బుధాదిత్య, శుక్రాదిత్య, లక్ష్మీనారాయణ యోగాలను కూడా సృష్టిస్తోంది. ఈ అరుదైన కలియిక ద్వారా ముఖ్యంగా మూడు రాశులు గొప్ప లాభాన్ని పొందబోతున్నాయి.

మేషం:

మేషరాశి వారికి ఈ కలయిక చాలా యోగంగా ఉండబోతోంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పురోగతి, కొత్త అవకాశాలు, వ్యాపారవేత్తలకు కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే విజయం వీరి సొంతమవుతుంది. విద్యార్థులకు తమ కెరీర్‌లో కొత్త మార్గాలు కనబడొచ్చు. న్యాయపరైన వివాదాల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

తులారాశి:

తులారాశి వారికి సంబంధించి చూస్తే వ్యాపారవేత్తలకు ఈ కలయిక శుభప్రదంగా ఉంటుంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు ప్రయోజనాన్ని అందించొచ్చు. వ్యక్తిగత ఆనందం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ముఖ్యమైన ప్రయతాలు ఫలిస్తాయి. రాశిలోనే సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయిక వల్ల తులారాశిలో జన్మించిన వారికి అదృష్టం కలుగుతుంది.

ధనస్సు రాశి:

ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్, పనికి సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు కనిపించొచ్చు. ఈ సమయంలో కొత్త ప్రణాళికలపై పనిచేయడం, మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.