జూన్ 10 గురువారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమంకాదు. ఒక యత్నం ఫలిచడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పెద్దలు, అయినవారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
వృషభం : నరాలు, తల, ఎముకలకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్‌లోనూ వాహనం నడుపున్నపుడు ఏకాగ్రత ప్రధానం. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ అకట్టుకుంటారు.
Also Read
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
మిథునం : వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. నూతన ప్రదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. రాబోయే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకుంటారు.
కర్కాటకం : పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ఆప్తుల సలహాలను పాటిస్తారు. పాత మిత్రులతో కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ప్రేమికులకు మధ్య పెద్దలవల్ల సమస్యలు తలెత్తగలవు.
సింహం : ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఒక యత్నం ఫలించడంతో మీలోకొత్త ఉత్సాహం కనిపిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రావలసిన ధనం కోసం శ్రమ, ప్రయాసలు ఎదుర్కోవలసి వస్తుంది.
కన్య : మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. విద్యుత్ వస్తువులు పట్ల ఏకాగ్రత చూపుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఖర్చులు, అవసరాలు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. వైద్య రంగాలలోని వారికి పురోభివృద్ధి.
తుల : ఏ వ్యక్తితీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏసీ, కూలర్ మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు.
వృశ్చికం : విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ప్రణాళికాబద్దంగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. ఎప్పటి సమస్యలను అపుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు.
ధనస్సు : భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. కళలు, క్రీడలవారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
మకరం : స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. రాజకీయ, కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
కుంభం : రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. పాత రుణాలు తీర్చడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపిస్తారు.
మీనం : రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. విదేశాల నుంచి ఊహించని అవకాశాలు లభిస్తాయి. కొన్ని పాత వ్యవహారాలు చక్కబడతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి.
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!