జులై 21, బుధవారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభదాయకం. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదుర్కొంటారు.
వృషభం : విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తిచేయగలగుతారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి.
Also Read
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
మిథునం : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలకు ఉదరం, దంతాలు, నడుము, మోకాళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. కొత్త రుణాలు అన్వేషిస్తారు. నూనె, పసుపు, చింతపండు, స్టాకిస్టులకు రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. వాహనచోదకులకు స్వల్ప ఆటంకాలు తప్పవు.
కర్కాటకం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలమైన కాలం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఇతరులను అతిగా విశ్వసించడం మంచిదికాదు. మీ ధైర్య సాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి.
సింహం : పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శత్రువులు, మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. కుటుంబీకుల నిర్లక్ష్య వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి.
కన్య : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్న మీ ధ్యేయం త్వరలో కార్యరూపం దాల్చుతుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యుత్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
తుల : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికంగా ఉంటుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. పాత రుణాలు తీరుస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. స్త్రీలతో మితంగా సంభాషించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృశ్చికం : ఉపాధ్యాయులకు నూతన అవకాసాలు లభించగలవు. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. ఎండుమిర్చి, నూనె, బెల్లం, ఆవాలు, పసుపు, వ్యాపారస్తులకు లాభదాయకం. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాలు గుర్తి తగాదాలు రావొచ్చు. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి.
ధనస్సు : రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
మకరం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధు మిత్రులకు హామీ ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. హోటల్, తినుబండారు వ్యాపారులు లాభదాయకంగా ఉంటాయి
కుంభం : విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల విషయాలలో తలదూర్చడం వల్ల ఇప్పందులకు గురవుతారు. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. దంపతుల మధ్య చిన్నచిన్న కలహాలు, పట్టింపులెదురవుతాయి.
మీనం : మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్తి పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. చేపట్టిన పనులలో నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలు కొత్త వ్యక్తులతో తక్కువుగా సంభాషించడం మంచిది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!