Chandra Grahanam: అద్భుత దృశ్యానికి ఆకాశం వేదిక కానుంది. ఎప్పుడని చూస్తున్నారా.. ఈరోజే. ఆ నీలాకాశంలో ఈ రోజు చంద్రుడు ఎరుపు వర్ణంలో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. అందుకే దీన్ని శాస్త్రవేత్తలు బ్లడ్‌మూన్ అంటున్నారు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, దీనిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. వాతావరణం బాగుంటే ఈరోజు ఏర్పడే చంద్రగ్రహణాన్ని వరల్డ్ వైడ్‌గా 85శాతం మంది చూసే అవకాశం ఉందన్న అంచనా.
READ ALSO: Anakapalle : అనకాపల్లి జిల్లాలో కారు బీభత్సం – తప్పిన పెద్ద ప్రమాదం
భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఆ తర్వాత రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుందని, 11..41కి చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడని చెప్పారు. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని వెల్లడించారు. ఈ బ్లడ్‌మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగుతుందని ప్రాథమిక అంచనా.
చందమామ పూర్తి ఎర్రరంగుతో ఉన్న దృశ్యాన్ని కన్నులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్యే అంటున్నారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాతో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడాఖ్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్‌లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లడ్‌మూన్‌ని ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా స్పష్టంగా చూడొచ్చని, ఇది సురక్షితం అంటున్నారు. మొత్తంగా బ్లడ్‌మూన్ ఖగోళ ప్రియులకు పండగే.
చంద్రగ్రహణం..
* రాత్రి 8 గంటల 58 నిమిషాలకు గ్రహణం ప్రారంభం
* రాత్రి 9:57 నిమిషాల నుంచి స్పష్టంగా బ్లడ్‌మూన్
* రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభం
* 11:41కి ఎరుపు వర్ణంలోకి మారనున్న చంద్రుడు
* రాత్రి 2:25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగింపు
READ ALSO: BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్.. బెనిఫిట్స్ మామూలుగా లేవు
