Astrology: మార్చి 13, ఆదివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం :- రాజకీయాలలో వారికి గణణీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. రవాణా రంగాల వారికి మెళుకువ, ఏకాగ్రత అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు.
వృషభం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆసక్తి అధికమవుతుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు.
Also Read
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
మిథునం :- స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల దేనిలోను ఏకాగ్రత వహించలేరు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మీరు అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు. ఊహించని ఖర్పుల వల్ల అధిక ధన వ్యయం తప్పదు.
కర్కాటకం :- మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపట్ల మక్కువ పెరుగుతుంది. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహం :- రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. దూరప్రయాణాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి.
కన్య :- సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. తప్పనిసరి చెల్లింపుల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. మిత్రుల రాకతో ఖర్చులు అధికం.
తుల :- కాంట్రాక్టర్లకు పనివారితో సమస్యలు తప్పవు. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్ కాలంను సద్వినియోగం చేసుకోండి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కుంటారు.
వృశ్చికం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదు. పాత వస్తువులను కొని ఇబ్బందులకు గురవుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో ధనం ఖర్చు చేస్తారు. విందు, వినోదాలలో పరిమితి పాటించండి. స్త్రీలు ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తూ సత్ఫలితాలు పొందుతారు.
ధనస్సు :- మీపై శకునాలు, పట్టింపులు తీవ్ర ప్రభావం చూపుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరంచేస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.
మకరం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. చీటికి, మాటికి ఎదుటివారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్త్రీల ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
కుంభం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి.
మీనం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. బంధువులు, కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు ఎదురవుతాయి.
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!