Site icon NTV Telugu

Tamilnadu: తొక్కిసలాటకు స్టాలిన్ ప్రభుత్వమే కారణం- టీవీకే పార్టీ నేతలు

Untitled Design (2)

Untitled Design (2)

తొక్కిసలాట ఘటనపై టీవీ కే పార్టీ లో చర్చ జరిగింది. తొక్కిసలాట ఘటనకు కారణం స్టాలిన్ ప్రభుత్వమే అంటూ టీవీకే పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాము అడిగిన ప్రాంతంలో కాకుండా చిన్నపాటి రోడ్డులో సభ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో.. ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… చెన్నై దుండిగల్ జిల్లా కరూర్ లో టీవీ కే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ రోడ్ షో నిర్వహించారు. దీంతో హీరో విజయ్ ను చూసేందుకు భారీగా జనాలు ఎగబడ్డారు. ఈ ఘటనలో చిన్న పిల్లలతో సహా దాదాపు 39 మంది చనిపోయారు.. 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే.. తొక్కిసలాట ఘటనకు కారణం స్టాలిన్ ప్రభుత్వమే అంటూ టీవీకే పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాము అడిగిన ప్రాంతంలో కాకుండా చిన్నపాటి రోడ్డులో సభ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో.. ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.విజయ్ సభ జరుగుతున్న సమయంలో కావాలనే అంబులెన్స్ లను జనం మధ్యలో నుంచి తీసుకుని వెళ్లేలా చేశారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. అందుకే తొక్కిసలాట జరిగిందని..పోలీసులతో కలిసి డీఎంకే ప్రభుత్వం విజయ్ పై కుట్ర పన్నిందని టివికే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Exit mobile version