మరోసారి బాలకృష్ణ, మీనా కాంబినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలకృష్ణ, మీనా మరో సారి జోడీ కట్టబోతున్నారు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తో పలు చిత్రాలలో సందడి చేసింది. ఆ తర్వాత పెళ్ళి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరం అయినా కూతురు పుట్టిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, మలయాళ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు చూపిస్తోంది మీనా. ప్రస్తుతం వెంకటేశ్ తో ‘దృశ్యం2’లో నటిస్తోంది మీనా. అంతే కాదు తాజాగా బాలకృష్ణతో సినిమా చేయటానికి కమిట్ అయిందట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమాలో బాలకృష్ణతో నటించబోతోంది మీనా. అందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిపోడ్ లో మీనా కనిపిస్తుందట. ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుందంటున్నారు. గతంలో ‘ముద్దుల మొగుడు, బొబ్బిలిసింహం, కృష్ణబాబు, అశ్వమేథం’ వంటి పలు చిత్రాల్లో సందడి చేసిందీ జంట. ఇక ప్రస్తుతం ‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఆరంభించనున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
Also Read
తాజావార్తలు
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!