Site icon NTV Telugu

మరోసారి బాలకృష్ణ, మీనా కాంబినేషన్

2 Heroines in Balakrishna and Gopichand Malineni Project

బాలకృష్ణ, మీనా మరో సారి జోడీ కట్టబోతున్నారు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తో పలు చిత్రాలలో సందడి చేసింది. ఆ తర్వాత పెళ్ళి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరం అయినా కూతురు పుట్టిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, మలయాళ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు చూపిస్తోంది మీనా. ప్రస్తుతం వెంకటేశ్ తో ‘దృశ్యం2’లో నటిస్తోంది మీనా. అంతే కాదు తాజాగా బాలకృష్ణతో సినిమా చేయటానికి కమిట్ అయిందట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమాలో బాలకృష్ణతో నటించబోతోంది మీనా. అందులో ఫ్లాష్‌ బ్యాక్ లో వచ్చే ఎపిపోడ్ లో మీనా కనిపిస్తుందట. ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుందంటున్నారు. గతంలో ‘ముద్దుల మొగుడు, బొబ్బిలిసింహం, కృష్ణబాబు, అశ్వమేథం’ వంటి పలు చిత్రాల్లో సందడి చేసిందీ జంట. ఇక ప్రస్తుతం ‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఆరంభించనున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

Exit mobile version