Site icon NTV Telugu

ఫోటోషూట్లతో నెట్టింట్లో జాన్వీ కపూర్ రచ్చ…!

Khushi Kapoor latest photoshoot

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధఢక్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ పిక్స్ చేసిందంటే అవి క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆమెకు బాలీవుడ్ లో అంతటి క్రేజ్ ఉంది. ఇక తాజాగా శ్రీదేవి, బోనీకపూర్ ల చిన్న కూతురు ఖుషీ కపూర్ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇటీవలే బికినీతో ఎవ్వరూ ఊహించని విధంగా హాట్ షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా రెడ్ డ్రెస్ లో హీట్ పెంచేస్తోంది.

Read Also : 7 రొటీన్ స్టెప్స్ తో గ్లాస్ స్కిన్ గ్లో…!

తాజాగా రెడ్ డ్రెస్ లో ఖుషి కపూర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. ఆ పిక్స్ నెటిజన్లు షేర్లు లైకులతో రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఖుషి ఇంకా ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. అప్పుడే ఈ అమ్మడికి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తన హాట్ పిక్స్ తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుని మరింత క్రేజ్ ను మూటగట్టుకుని పనిలో పడింది. ఖుషి స్పీడ్ చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేలా కన్పిస్తోంది. మరి జాన్వీ కపూర్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహారే ఖుషి కపూర్ ను పరిచయం చేస్తాడేమో చూడాలి.

Exit mobile version