NTV Telugu Site icon

క్యూట్ నెస్ తో దిల్ చోరీ చేస్తున్న మేఘ

Megha Akash

ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ విజయంతో మేఘా ఆకాష్ వెండి తెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గతంలో ఎన్ని సినిమాలు చేసినా, రజినీకాంత్, ధనుష్, సల్మాన్ ఖాన్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఆమె దశ తిరగలేదు. కానీ ‘రాజ రాజ చోర’ మాత్రం ఆమె కెరీర్ కు బిగ్ టర్న్ అని చెప్పొచ్చు. ఎంతో క్యూట్ గా ఉండే ఈ అమ్మాయికి కెరీర్ మొదటి నుంచి పెద్దగా హిట్స్ ఏమీ లేకపోయినా అవకాశాలకు మాత్రం కొదవ లేకుండా పోయింది. అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ లైమ్ లైట్ లోనే ఉంటోంది.

Read Also : 40 ఏళ్ల ‘అమావాస్య చంద్రుడు’

తాజాగా ‘రాజ రాజ చోర’ ఆమె ఎంతోకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితాన్ని ఇచ్చింది. దీంతో ఈ అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఇద్దరు సినిమాలతో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫుల్ బిజీగా ఉంది. తెలుగులోనే మను చరిత్ర, గుర్తుందా శీతాకాలం, డియర్ మేఘ, అక్టోబర్ 31 లేడీస్ నైట్ వంటి చిత్రాలు చేస్తోంది. ఇందులో గుర్తుందా శీతాకాలం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో మరో చిత్రంలో కనిపించనుంది. మరి ఇప్పటికైనా ఆమె కెరీర్ ను టర్న్ చేస్తుందేమో చూడాలి.

Show comments