తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది కార్తీక దీపం ఫేమ్ వంటలక్క. ప్రస్తుతం వంటలక్క అసలు పేరు.. దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్. అయితే.. బుల్లితెర అభిమానులు మాత్రం ఆమె అసలు పేరు కంటే.. వంటలక్క అంటేనే ఎక్కువగా గుర్తుపడతారు. అయితే తెలుగు నాట కార్తీక దీపం సీరియల్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనందరికి తెలుసు.. ఇందులో దీప, కార్తీక్, మోనిత కార్యెక్టర్లకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు.
Read Also: Ganja Seized: ట్రైన్ లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్స్.. పట్టుకున్న పోలీసులు
సాయంత్రం టీవీ సీరియల్స్ చూసేందుకు మహిళలు పోటీపడుతుంటారు. మహిళలంతా బాగా ఇష్టంగా చూసే సీరియల్ కార్తీక దీపం.. ఇందులో వంటలక్కు ఒక సెఫరేట్ ఫ్యాన్ పాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు. వంటలక్క ఆమె నటనతో ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు. అయితే ఈ సీరియల్ నటించిన వంటలక్క అలియాస్ దీప (ప్రేమి విశ్వనాథ్).. కేరళ రాష్ట్రానికి చెందిన నటి.. తెలుగు బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్ కార్తీక దీపం సీరియల్ అయిపోయింది. అయితే ఫ్యాన్స్ కోసం మరల కార్తీక దీపం: ఇది నవ వసంతం అనే పేరుతో కొత్త భాగాన్ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సీరియల్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.
Read Also: Youngest Mla: ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ ఆస్తులెంతో తెలుసా..
ఈ సీరియల్ కూడా మంచి పాపులారిటీ రావడంతో.. తెలుగులో అవకాశాలు ఎక్కువయ్యాయి. అయితే బీజీ షెడ్యూల్ కారణంగా తన భర్త పిల్లలను వదిలేసి ఇక్కడే ఉండాల్సి వస్తుందని.. ఆమె తన బాధను చెప్పుకుంది. . తను కేరళలో ఉన్నప్పుడు.. తన భర్త వేరే రాష్ట్రంలో ఉండేవాడని.. తెలిపింది. ప్రస్తుతం ఇద్దరం బిజీ బిజీగా ఉండటంతో … కలిసేందుకు టైం కూడా కుదరడంలేదంటుంది ఈ బుల్లితెర భామ.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
