Site icon NTV Telugu

కరోనా నుంచి కోలుకున్న పవన్

Tirupathi Lok Sabha By Elections Analysis

ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల కరోనా పాజిటీవ్ రావటంతో పవన్ ఐసోలేషన్ లోకి వెళ్ళి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. మూడు రోజుల క్రితం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటీవ్ వచ్చిందని అయితే కరోనా తర్వాత పవన్ కొద్దిగా వీక్ గా ఉన్నారని ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని డాక్టర్ల బృదం తెలిపింది. అయితే తన ఆరోగ్యం బాగుపడాలని, క్షేమాన్ని కోరుతూ పూజలు చేసిన జనసేన సైనికులు, నాయకులకు పవన్ ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలియచేశారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు పవన్.

Exit mobile version