Site icon NTV Telugu

Bigg Boss : అనారోగ్య సమస్యలతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్..

Untitled Design (4)

Untitled Design (4)

ఈ వారం మహారాష్ట్రలోని బిగ్ బాస్ -19 “వీకెండ్ కా వార్” చాలా ఆసక్తికరంగా మారింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ హౌస్‌మేట్‌లను గట్టిగా మందలించాడు. అతను హౌస్‌మేట్‌లకు ఊహించని షాక్ కూడా ఇచ్చాడు. అయితే గత వారం కెప్టెన్‌గా ఎంపికైన స్టాండ్-అప్ కమెడియన్ ప్రణీత్ మోర్ షో నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.

Read Also: Fake Agniveer: అగ్నివీర్ సైనికుడు అని చెప్పుకుంటూ.. ప్రయాణీకుల బ్యాగుల చోరీ.. వ్యక్తి అరెస్ట్

పూర్తి వివరాల్లోకి వెళితే.. డెంగ్యూ వంటి తీవ్రమైన అనారోగ్యం కారణంగా వీకెండ్ కా వార్ ఎపిసోడ్ లో స్టాండప్ కమెడియన్ ను బిగ్ బాస్ నుంచి బయటకు పంపించారు. అయితే గతవారమే అతడు కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. అయితే డెంగ్యూ వంటి తీవ్రమైన అనారోగ్యం కారణంగా “వీకెండ్ కా వార్” ఎపిసోడ్‌లో ప్రణిత్ మోర్‌ను ఇంటి నుండి బయటకు పంపించారు. తన అనారోగ్యం కారణంగా ప్రణీత్ షో నుండి తప్పుకుంటున్నాడని హోస్ట్ సల్మాన్ స్పష్టం చేశాడు. కొన్ని రోజుల క్రితం, ప్రణీత్‌కు డెంగ్యూ పాజిటివ్‌ వచ్చింది. అయినప్పటికి అతడి ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో.. మేకర్స్ అతన్ని ఇంటి నుండి బయటకు పంపేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం అతను వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని.. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు ప్రకటించారు.

Exit mobile version