Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవరాత్రి ఉత్సవాలతో దేశవ్యాప్తంగా పండుగ సందడి కనిపిస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్కెట్లు హోరెత్తుతున్నాయి. కానీ.. ఈసారి స్మార్ట్ ఫోన్ల మార్కెట్ మాత్రం తీవ్ర నిరాశ పరుస్తోంది. ఎన్నడూ లేని విధంగా మొబైల్ సేల్స్ పడిపోయాయి. ఒకవైపు తగ్గిన డిస్కౌంట్లు.. మరోవైపు పెరిగిన ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి. ఈ నవరాత్రికి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఎందుకు తగ్గాయి? అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది?
పండుగ సీజన్ అంటేనే స్మార్ట్ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజులతో పోలిస్తే నవరాత్రి, దసరా, దీపావళి సమయంలోనే జనాలు కొత్త ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఏటా స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో 30 నుంచి 35 శాతం ఈ పండుగ సీజన్ లోనే జరుగుతాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఈకామర్స్ నవరాత్రి సేల్స్ లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 16 శాతం పడిపోయాయి. ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నవరాత్రి మొదలైనప్పటి నుంచి రిటైల్ స్టోర్లలో మొబైల్ సేల్స్ 20 శాతం తగ్గాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ – AIMRA చెబుతోంది. దసరా, దీపావళి నాటికి అమ్మకాలు పుంజుకుంటాయని వ్యాపారులు ఆశిస్తున్నారు. అయినా సరే పండుగ సీజన్ లో ఓవరాల్ గా రిటైల్ సేల్స్ 15 శాతానికి పైగా పడిపోయే అవకాశం ఉందని AIMRA అంచనా వేస్తోంది. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లలోనూ పండుగ సేల్స్ లో 60 నుంచి 65 శాతం వ్యాపారం నవరాత్రి సమయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి ఆ జోరు కనిపించడం లేదు.
మొబైల్ ఫోన్ల అమ్మకాలు ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణం ధరలు పెరగడమే. మార్కెట్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొనాలంటే కస్టమర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మెమరీ చిప్‌ల ధరలు రెండు నుంచి మూడు రెట్లు విపరీతంగా పెరగడం, రవాణా ఖర్చులు తడిసి మోపెడు కావడంతో.. స్మార్ట్ ఫోన్ల ధరలు సగటున 35 నుంచి 40 శాతం మేర పెరిగాయి. దీనికి తోడు గత ఏడాదితో పోలిస్తే ఆన్ లైన్ డిస్కౌంట్లు భారీగా తగ్గాయి. పోయినేడాది పండుగ సేల్స్ లో 25 నుంచి 40 శాతం వరకు ఆన్ లైన్ డిస్కౌంట్లు ఇచ్చారు. ఈసారి అవి కేవలం 10 నుంచి 25 శాతానికే పరిమితం అయ్యాయి. ధరలు పెరగడం, ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేకపోవడంతో కస్టమర్లు ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ద్రవ్యోల్బణ ప్రభావంతో సెప్టెంబర్ నెలలో రిటైల్ స్టోర్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య 40 నుంచి 50 శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read
ధరల మంటతో సామాన్య మధ్యతరగతి వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. బడ్జెట్ కస్టమర్లు కొత్తవి కొనే బదులు సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు పాత ఫోన్లనే రిపేర్ చేయించుకుని వాడుకుంటున్నారు. అయితే.. మార్కెట్ మందకొడిగా ఉన్నప్పటికీ 45 వేల రూపాయల పైబడిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగానికి మాత్రం పెద్దగా నష్టం జరగలేదు. ప్రీమియం మోడళ్లకు కస్టమర్ల నుంచి డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ఇక దీపావళి తర్వాత మొబైల్ ఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల గణాంకాలను పరిశీలిస్తే.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 10 శాతం పడిపోయాయి.
తాజావార్తలు
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!