NTV Telugu Site icon

World Students Day 2024: నేడు ప్రపంచ విద్యార్థి దినోత్సవం.. అబ్దుల్ కలాం జయంతి రోజునే ఎందుకు..?

World Students Day 2024

World Students Day 2024

World Students Day 2024: ప్రస్తుతం రాజకీయంగా ఒక్క చిన్న పదవి ఉంటే చాలు కొన్ని కోట్లు వెనుకేసుకుంటున్నారు. ఆయన ఎంతటి గొప్ప వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా పేరుపొందిన ఆయన గొప్ప సైంటిస్ట్ గానే కాకుండా మానవతావాదిగా కూడా పేరు పొందారు. ఆయన చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఎందరికో రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ఆయన చనిపోయి దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన ఆ పదవికే వన్నెతెచ్చారు. అవినీతి ఆరోపణలు లేని గొప్ప వ్యక్తి కలాం. అంతేకాదు ఎటువంటి రాజకీయ చరిత్ర లేకుండానే కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారు.

Read also: Telangana Rain Alert: హైదరాబాద్ లో కుండపోత వర్షం.. మూడ్రోజులు భారీ వర్షాలు..

అబ్దుల్‌ కలాం భారతదేశానికి 11వ రాష్ట్రపతి అయ్యారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు కూడా. ఆయన సాధించిన గొప్ప విజయాలకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా లభించింది. భారతదేశ విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. విద్యార్థులంటే ఆయనకు చాలా అభిమానం. ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూనే తుది శ్వాస విడిచారు. అక్కడ ఆయన గుండెపోటుతో మరణించారు. అయితే ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. ఇది మన మాజీ రాష్ట్రపతి, భారత మిస్సైల్ మ్యాన్ అయిన డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘనంగా జరుపుకుంటారు.

Read also: Big Breaking: ఉపాధ్యాయులకు ఊహించని షాక్.. డీఎస్సీ కౌన్సెలింగ్‌ను వాయిదా..

APJ అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?

డా. కలాం జన్మదినాన్ని పురస్కరించుకుని, ఐక్యరాజ్యసమితి 2010లో అక్టోబర్ 15ని ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. డా. కలాంకు విద్య, యువత అభివృద్ధి, విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమకు UN నుండి గుర్తింపు పొందారు. ఆయన అభ్యాసకులుగా కాకుండా, విద్యార్థులను సమాజంలో విప్లవాత్మకంగా మార్చే భవిష్యత్తు నాయకులుగా చూశాడు. డాక్టర్ కలాం తన మాటలు, చేతలలో విద్య యొక్క విలువను నిరంతరం నొక్కిచెప్పారు, లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించడానికి కష్టపడి పనిచేయడానికి విద్యార్థులను ప్రేరేపించారు. అందుకే ఇవాళ (అక్టోబర్‌ 15)న డా. కలాం జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటారు.
Harish Rao: మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు..