Site icon NTV Telugu

TTD Recruitment 2023 : టీటీడీ లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం.. అర్హతలు?

Jobs (2)

Jobs (2)

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి శుభవార్త.. తాజాగా టీటీడీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇంజనీరింగ్ విభాగంలో పలు ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీలు..

మొత్తం: 56
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 27 ఖాళీలు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)10 ఖాళీలు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్)19 ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాల పై ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుకు నవంబర్‌ 23 ఆఖరు తేదీగా ప్రకటించారు.. అంటే కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉంది..

అర్హతలు..

బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్‌, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు..

ఎంపిక విధానం..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు..

జీతం..

ఏఈఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు, ఏఈ పోస్టులకు సెలక్ట్ అయిన వారికి నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు , ఏటీవో పోస్టులకు నెలకు రూ. 37,640 నుంచి రూ. 1,15,500 వరకు జీతంగా చెల్లిస్తారు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 23వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు… ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://ttd-recruitment.aptonline.in సందర్శించగలరు..

Exit mobile version