NTV Telugu Site icon

TTD Jobs:నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..టీటీడీలో భారీగా ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

Ttd 2024

Ttd 2024

నిరుద్యోగులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 78 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవగా..వీటిలో డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు 49,జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు 29 ఉన్నాయి.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం,అప్లయ్ చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 25,2024.. పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం..

పోస్టుల వివరాలు..

జూనియర్ లెక్చరర్ పోస్టులు: 29

సబ్జెక్టుల వారీ జేఎల్‌ ఖాళీలు: హిస్టరీ- 4, సివిక్స్‌- 4, కెమిస్ట్రీ- 4,బోటనీ- 4, తెలుగు- 3,కామర్స్‌- 2,ఫిజిక్స్- 2,జువాలజీ- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1,మ్యాథమెటిక్స్‌- 2 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు..

కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు..
అభ్యర్థుల వయసు 01-07-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి..

జీతం..

జీతం నెలకు జూనియర్ లెక్చరర్‌ పోస్టులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు ఉంటుంది…

ఎంపిక ప్రక్రియ..

కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్స్ వేరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..

అప్లికేషన్ ఫీజు..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..