NTV Telugu Site icon

TS EAPCET 2024: తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసింది..

Ts Emcet

Ts Emcet

తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ ఏడాది ఎంసెట్ నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.. ఆ ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఏడాది జరగబోయే పరీక్షల నోటిఫికేషన్ జేఎన్టీయూ హైదరాబాద్ 21 ఫిబ్రవరి 2024 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పరీక్షలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 26 నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పరీక్షల గురించి పూర్తి సమాచారం కోసం https://eamcet.tsche.ac.in/ ని సందర్శించవలసిందిగా కోరారు. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ -ఫార్మా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను గతంలో ఎంసెట్ అని సంబోదించేవారు ఇప్పుడు దాన్ని ఈఏపీసెట్ గా మార్చారు.