NTV Telugu Site icon

TG EAPCET 2025: అలర్ట్.. టీజీ ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

Tgeapcet

Tgeapcet

2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంజినీరింగ్‌/ అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్‌ విడుదలైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు కొనసాగుతుంది. ఏప్రిల్ 6 – 8 వరకు ద‌ర‌ఖాస్తులో త‌ప్పుల స‌వ‌రించుకోవచ్చు. ఆలస్య రుసుము చెల్లించి.. ఏప్రిల్ 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాగా.. ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

READ MORE: CM Chandrababu: వైఎస్‌ జగన్‌ భద్రతపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఇది సబబేనా..?

ఏప్రిల్ 9 – రూ. 250 ఆల‌స్య రుసుము
ఏప్రిల్ 14 – రూ. 500 ఆల‌స్య రుసుము
ఏప్రిల్ 18 – రూ. 2500 ఆల‌స్య రుసుము
ఏప్రిల్ 24 – రూ. 5 వేల ఆల‌స్య రుసుము

READ MORE: Hyderabad Rain : హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం..

ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షల‌ను నిర్వహిస్తారు. కంప్యూట‌ర్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈఏడాది కూడా ఈఏపీసెట్‌ బాధ్యతలు జేఎన్టీయూ తీసుకుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కాగా, కన్వీనర్‌ కోటా బీటెక్‌ సీట్లు మొత్తం రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.