Telangana Inter Exam Fee Dates: తెలంగాణలో మార్చి-2024 మర్చి లో జరగనున్న ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజులకు సంబంధించిన నోటిఫికేషన్ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఫస్టియర్, సెకండియర్ విధ్యార్ధులతో పాటు ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు రాసేవారు, అలానే హాజరు లేకుండా పరీక్ష రాసే ప్రైవేట్ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల అంటే ఆక్టోబర్ట్ 26వ తేదీ నుంచి నవంబర్ 14 తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అనంతరం 100 రూపాయల ఫైన్ తో నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. నవంబర్ 23వ తేదీ దాటిన తర్వాత ఫీజు చెల్లించాలి అనుకుంటే 500/- రూపాయల ఆలస్య రుసుముతో నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
Read also:Telangana Politics: సొంత గూటికి కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి..
ఇంకా ఆలస్యం అయితే రూ. 1,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 13 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అనంతరం రూ.2,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. కాగా పరీక్ష ఫీజు వివరాలు చూస్తే..
మొదటి సంవత్సరం జనరల్ కోర్స్ అభ్యర్థులు రూ.510/-
ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్స్ ఆర్ట్స్ అభ్యర్థులు రూ.510/-
ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్స్ సైన్స్ అభ్యర్థులు రూ.730/-
ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్స్ అభ్యర్థులు రూ.730/-
మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్స్ – ప్రాక్టికల్స్ తో అభ్యర్థులు రూ.730/-