NTV Telugu Site icon

SSC Constable GD Notification: 26,146 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Job Vacancy

Job Vacancy

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్టాప్ సెలెక్షన్ కమీషన్ తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 26,146 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు.. ఇక ఆలస్యం ఎందుకు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు.. 26,146..

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌-6,174 పోస్టులు,

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌-11,025 పోస్టులు,

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌-3,337 పోస్టులు,

సశస్త్ర సీమాబల్‌-635 పోస్టులు,

ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌ 3,189 పోస్టులు,

అస్సాం రైఫిల్స్‌(రైఫిల్‌మెన్‌)-1,490 పోస్టులు,

సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌-296 పోస్టులు.

అస్సాం రైఫిల్స్‌ విభాగంలో రైఫిల్‌ మెన్‌ హోదాలో మేన్స్ – 2,799 పోస్టులు..

అర్హతలు..

గుర్తింపు పొందిన బోర్డులో పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి.. 2024 జనవరిలో పాస్ అయిన వాళ్లకు ప్రాధాన్యత..

వేతనం

ఎంపిక అయినవారికి జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన వారికి ప్రారంభంలోనే పే లెవల్‌-3తో వేతనం అందిస్తారు. అంటే నెలకు రూ.21,700-రూ. 69,100తో నెల వేతన శ్రేణి అందుకోవచ్చు..

ఎంపిక ప్రక్రియ..

ఈ పోస్ట్‌లకు సంబంధించి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌. ఈ మూడు దశల తర్వాత డిటెయిల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌లను కూడా నిర్వహిస్తారు.. ఇలా సెలెక్ట్ అయినవారికి పోస్టులను కేటాయిస్తారు..

ముఖ్య తేదీలు..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 31.12.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: 2024 జనవరి 4 – 6 వరకు.
రాత పరీక్ష తేదీ: 2024 ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించే అవకాశం.

తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు..

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in/ ను పరిశీలించగలరు.. నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..