NTV Telugu Site icon

SCCL Notification 2024: సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..పూర్తి వివరాలు..

Singareni

Singareni

తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సింగరేణిలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 272 పోస్టులను భర్తీ చేయనున్నారు.. సింగరేణి సీఎండీ బలరాం నోటిఫికేషన్‌ వివరాలను వెల్లడించారు. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) పోస్టులు 10, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ పోస్టులు 10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో-జియాలజిస్ట్‌) పోస్టులు 2, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు 18, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ) పోస్టులు 22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌) పోస్టులు 22, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు 3, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 30 ఉన్నాయన్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీస్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టులు 16..

వయోపరిమితి..

వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు. వైద్యాధికారి పోస్టులకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. మిగిలిన అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి మినహాయింపు ఇచ్చారు..

మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులకు మార్చి 18వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.. అలాగే పూర్తి వివరాలను మార్చి 1న విడుదల చేసే నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.. ఇతర పూర్తి వివరాలకు సింగరేణి సంస్థ వెబ్‌సైట్‌ లోని ‘కెరీర్‌’విండోను సందర్శించాలని సంస్థ యాజమాన్యం అభ్యర్ధులకు సూచించింది..