NTV Telugu Site icon

SBI Jobs : ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.45 వేల జీతం..

Sbi

Sbi

ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. బ్యాంకులో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 94 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

ఈ ఉద్యోగాల పై ఆసక్తి అర్హత అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.. నిన్నటి నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు..దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 21, 2023లోపు లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రిటైర్డ్ బ్యాంకు అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్ట్‌లలో ఉద్యోగం పొందడానికి ఆసక్తి ఉన్న వారు ముందుగా ఈ ఇచ్చిన పాయింట్లను చదివి అప్లై చేసుకోవాలి..

అర్హతల విషయానికొస్తే.. మాజీ ఉద్యోగులను తీసుకోవడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ ఉద్యోగాల అనుభవం, సిస్టమ్‌లు మరియు ప్రక్రియలపై లోతైన పరిజ్ఞానం మరియు సంబంధిత రంగంలో మొత్తం వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అర్హులు..

ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ప్రక్రియలో ఇంటర్వ్యూ రౌండ్ కూడా ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి, లేకుంటే వారి దరఖాస్తు/అభ్యర్థిత్వం షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ కోసం పరిగణలోకి తీసుకోబడదు.. ఇది గుర్తుంచుకోండి..

ఇక ఎలా సెలెక్ట్ చేస్తారంటే.. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.. అభ్యర్థులు కనీస అర్హత మార్కులను పొందినట్లయితే, ఇంటర్వ్యూలో పొందిన మార్కుల అవరోహణ క్రమంలో తుది ఎంపిక కోసం మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా, దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగలరు.. నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..