రైల్వేలో జాబ్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో పలు పోస్టులను భర్తీ చేస్తూ రైల్వే శాఖ తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 9000 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 9 నుండి ప్రారంభమవుతుండగా..అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 8. రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు… అర్హతలు, వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు..9000
పోస్టుల వివరాలు..
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 1,100 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్-III సిగ్నల్: 7,900 పోస్టులు
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి. రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్ తదితర పూర్తి వివరాలు త్వరలో విడుదలకానున్నాయి..
వయసు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వారు వయసును కూడా పరిగణలోకి తీసుకోవాలి.. వయస్సు 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి…
అప్లికేషన్ ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీ లేదా ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500…
జీతం..
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29,200… టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు నెలకు రూ.19,900 వరకు పొందవచ్చు.. ఆ తర్వాత జీతం పెరుగుతుంది..
ఎంపిక ప్రక్రియ..
ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు… ఎంపిక చేసిన వెంటనే పోస్టులలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు..